Sunday, 19 April 2020

దాతలు మంజులమ్మ, మునెమ్మ మరియు నాగభూషనమ్మ గారి సహాయంతో యువనేస్తం ఆధ్వర్యంలో 200 భోజన ప్యాకెట్లు పంపిణీ.


ఏర్పేడు లో ఈ రోజు 18.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్ధయ్యగుంట గ్రామానికి చెందిన మంజులమ్మగారు ,మునెమ్మ గారు,నాగభూసనమ్మ గారు వారి సొంత ఖర్చుతో 200 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు  ,పోలీసులకు, పంగూర్ లో ఉన్న బీహార్ కూలీలకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశామని  ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే  రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడు మండలంలో  భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు,నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన మంజులమ్మ గారికి, మునెమ్మ గారికి, నాగభూషనమ్మ గారికి ప్రత్యేకంగా ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు,మరియు ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, ఈశ్వర్ గారు, భార్గవ్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.


No comments:

Post a Comment