Wednesday, 24 June 2020
Sunday, 21 June 2020
Tuesday, 16 June 2020
Tuesday, 26 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో మేర్లపాక పంచాయతీ ST కాలనీలో ఉన్న పేదలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.
ఈ రోజు 26.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు ఏర్పేడు మండలం మెర్లపాక పంచాయితీ ST కాలనీలో ఉన్న నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. మేర్లపాక గ్రామానికి దూరంగా నిరుపేదవాళ్ళు మరియు తల్లిదండ్రులు లేని పిల్లవాళ్లు కూడా ఉన్నారని వారు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళుచాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణి, ట్రస్ట్ సభ్యురాలు మునెమ్మ గారు, సుదీర్ తదితరులు పాల్గొన్నారు.
Thursday, 21 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో ఆటో కార్మికులకు చేయూత.
ఈ రోజు 20.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు శ్రీ కాళహస్తి మండలంలోని కొండమిట్ట, వాటర్ వర్క్ కాలనీ, పొన్నాలమ్మ వీధి,పానగల్ వీధి, బీపీ అగ్రహారం ST కాలనీ లలో ఉన్నకొంతమంది ఆటో కార్మికులకు, నిరుపేదలకు 10 కేజీల బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, శాని టైజర్లు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ఆటో తోలుకునే కార్మికులు, రోజు వారి కూలీలు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనాధులకు, నిరుపేదలకు దాతల సహయంతో సహాయం చేయడమే యువనేస్తం ట్రస్ట్ లక్ష్యం అని తెలిపారు. ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ కి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 20 May 2020
Tuesday, 19 May 2020
Monday, 18 May 2020
Thursday, 14 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవాసంస్ధ సహకారంతో ఇసుకదిబ్బ, V. M. పల్లి పరిధిలోని అనాధాలకు 10 కేజీల బియ్యం, కోడిగుడ్లు మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ.
ఈ రోజు 14.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11గంటలకు కాళహస్తి మండలం ఇసుకదిబ్బ,V. M. పల్లి పరిధిలోని తల్లి దండ్రులు లేని అనాధులకు సిర్డ్స్ సేవ సంస్థ సహకారంతో 10 కేజీల బియ్యం, నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు, మాస్కులు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు & చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులు గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేదవాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు లేని అనాధులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గారు తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 13 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పోతుమాలగుంట ST కాలనీ వాసులకు కూరగాయలు మరియు కోడిగుడ్లు పంపిణీ.
ఈ రోజు 13.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం అంజిమేడు పంచాయితీ పోతుమాలగుంట ST కాలనీలో ఉన్న కుటుంబాలకు కూరగాయలు, కోడిగుడ్లు దాతల సహాయంతో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ నిరుపేదలకు సహాయం చేయడమే యువనేస్తం ట్రస్ట్ లక్ష్యం అని తెలిపారు. ప్రతీ ఒక్కరు నిత్యావసర వస్తువుల కోసం రోడ్ పైకి వచ్చేటప్పుడు మాస్కులు వేసుకొని సామాజిక దూరం పాటించి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. మెయిన్ రోడ్ కి దూరంగా పోతుమాల గుంట దగ్గర నిరుపేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళకి సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో లోకేష్ గారు, కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 12 May 2020
Monday, 11 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవాసంస్ధ ఆర్థిక సహాయంతో నచ్చనేరి పంచాయతీ ST కాలనీ వాసులకు బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ.
ఈ రోజు 11.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం నచ్చనేరి పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు సిర్డ్స్ సేవ సంస్థ ఆర్ధిక సహాయంతో నిత్యావసర వస్తువులు మరియు దాతల సహాయతో బియ్యం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ గ్రామాలకు దూరంగా నిరుపేదవాళ్ళు గుడిసెల్లో నివసిస్తున్నారని వాళ్ళు లాక్ డౌన్ వలన చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో లోకేష్ గారు, కిరణ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Friday, 8 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో అమడూరు పంచాయతీ ST కాలనీ వాసులకు కూరగాయలు పంపిణీ
ఈ రోజు 07.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 10గంటలకు ఏర్పేడు మండలం అముడూరు పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు 4 రకాల కూరగాయలను దాతల సహాయంతో రెండో సారి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అముడూరు పంచాయతీ ST కాలనీ,మరియు రోడ్ సైడ్ లో అక్కడక్కడ ఉన్న 30 నిరుపేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశామని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణిగారు, చందు గారుతదితరులు పాల్గొన్నారు.
Sunday, 3 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవాసంస్ధ ఆర్థిక సహాయంతో 35 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.
ఈ రోజు 02.05.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం అముడూరు పంచాయితీ ST కాలనీలో ఉన్న కుటుంబాలకు మరియు హరిజన వాడలో ఉన్న నిరుపేదలకు కలిపి 35 కుటుంబాలకు సిర్డ్స్ సేవ సంస్థ ఆర్ధిక సహాయంతో ,నూనె ప్యాకెట్స్, నిత్యావసర వస్తువులు మరియు 5 కేజీల బియ్యం ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అముడూరు పంచాయతీ ST కాలనీ,హరిజన వాడ,మరియు రోడ్ సైడ్ లో అక్కడక్కడ ఉన్న నిరుపేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు,ఈ కార్యక్రమానికి చెన్నై లో ఉద్యోగం చేస్తున్న శ్రీనివాసులు గారు 150 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని మరియు వే ఫౌండేషన్ అంకయ్య గారు 40 కేజీల బియ్యం అందచేసారని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణిగారు,రాజేంద్ర గారు,గురుతేజ గారు,పనేంద్ర గారు,గురుసాయి గారు,గురవయ్య గారు తదితరులు పాల్గొన్నారు.
Friday, 1 May 2020
యువనేస్తం ఆధ్వర్యంలో సరస్వతి కండ్రిగ పంచాయతీ ST కాలనీలో ఉన్న 45 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు పంపిణీ.
ఈ రోజు 30.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం సరస్వతి కండ్రిగ పంచాయితి ST కాలనీలో ఉన్న 45 కుటుంబాలకు బియ్యం,కూరగాయలను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు,ఈ రోజు సరస్వతి కండ్రిగ గ్రామం నుంచి150 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని మరియు కేశవ ఫ్యాషన్(పాపానాయుడు పేట)వారు ఆర్ధిక సహాయం తో ఈ కార్యక్రమం చేశామని తెలిపారు, నిరుపేదలకు,అనాధులకు సహాయం చేయడానికి ధాతలు ముందుకు రావాలని కోరారు, సహాయం చేయడానికి ముందుకొచ్చిన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము,ఈ కార్యక్రమంలో అంగణవాడి టీచర్ భారతి గారు తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 28 April 2020
యువనేస్తం చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవాసంస్ధ ఆర్థిక ప్రోద్బలంతో కుమ్మరిమిట్ట ST కాలనీలో వున్న 33 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ.
ఈ రోజు 28.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవా సంస్థ ఆర్ధిక సహయంతో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం మోదుగుల పాళ్లెం పంచాయితీ కుమ్మరిమిట్ట ST కాలనీలో ఉన్న 33 కుటుంబాలకు 5కేజీల బియ్యం, నూనె ప్యాకెట్స్ మరియు నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ రోజు సౌటూర్ గ్రామం నుంచి గురవయ్య గారు 120 కేజీల బియ్యం, సిద్ధయ్యగుంట గ్రామం నుంచి ఈశ్వర్ గారు 30 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయడానికి ముందుకొచ్చిన సిర్డ్స్ సేవా సంస్థ వారికి మరియు గురవయ్య గారికి,ఈశ్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అంగణవాడి టీచర్ భారతి గారు తదితరులు పాల్గొన్నారు.
Sunday, 26 April 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు మరోసారి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి.
ఈ రోజు 26.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోమధ్యాహ్నం 12 గంటలకు దాతల సహయంతో ఏర్పేడు మండలం పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు రెండోసారి 50 కేజీల బియ్యం,5 కేజీల గోధుమపిండి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ కుక్కలవారి కండ్రిగ గ్రామానికి చెందిన రాజేష్ గారు 30 కేజీల బియ్యం అందచేసారని తెలిపారు. రాజేష్ గారికి ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
Saturday, 25 April 2020
యువనేస్తం మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కందాడ పంచాయతీ ST కాలనీలో ఉన్న చిన్న పిల్లలకు జ్యూస్, బాదంపాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ.
ఈ రోజు 25.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం కందాడ పంచాయితీ ST కాలనీలో ఉన్న చిన్నపిల్లలకు బిస్కెట్లు ,బాదంపాలు,జ్యుస్ ప్యాకెట్స్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు పంపిణీ చేశారని యువనేస్తం ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలంటే ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ తప్పకుండా పాటించాలని కోరారు. ఈ లాక్ డౌన్ వలన నిరుపేదవాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిరు పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతలు సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో శీను తదితరులు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)