Sunday, 26 April 2020

యువనేస్తం ఆధ్వర్యంలో పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు మరోసారి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి.


                     ఈ రోజు 26.04.2020  యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోమధ్యాహ్నం 12 గంటలకు దాతల సహయంతో ఏర్పేడు మండలం  పంగూర్  గ్రామంలో ఉన్న బీహార్  కూలీలకు రెండోసారి 50 కేజీల బియ్యం,5 కేజీల గోధుమపిండి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని  ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా  మునిశేఖర్ గారు మాట్లాడుతూ కుక్కలవారి కండ్రిగ గ్రామానికి చెందిన రాజేష్ గారు 30 కేజీల బియ్యం అందచేసారని తెలిపారు. రాజేష్ గారికి ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.


No comments:

Post a Comment