ఈ రోజు 28.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిర్డ్స్ సేవా సంస్థ ఆర్ధిక సహయంతో ఉదయం 11 గంటలకు ఏర్పేడు మండలం మోదుగుల పాళ్లెం పంచాయితీ కుమ్మరిమిట్ట ST కాలనీలో ఉన్న 33 కుటుంబాలకు 5కేజీల బియ్యం, నూనె ప్యాకెట్స్ మరియు నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. ఈ రోజు సౌటూర్ గ్రామం నుంచి గురవయ్య గారు 120 కేజీల బియ్యం, సిద్ధయ్యగుంట గ్రామం నుంచి ఈశ్వర్ గారు 30 కేజీల బియ్యం ట్రస్ట్ కి అందచేసారని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. సహాయం చేయడానికి ముందుకొచ్చిన సిర్డ్స్ సేవా సంస్థ వారికి మరియు గురవయ్య గారికి,ఈశ్వర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు,దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో అంగణవాడి టీచర్ భారతి గారు తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 28 April 2020
Sunday, 26 April 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు మరోసారి 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణి.
ఈ రోజు 26.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోమధ్యాహ్నం 12 గంటలకు దాతల సహయంతో ఏర్పేడు మండలం పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు రెండోసారి 50 కేజీల బియ్యం,5 కేజీల గోధుమపిండి, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ కుక్కలవారి కండ్రిగ గ్రామానికి చెందిన రాజేష్ గారు 30 కేజీల బియ్యం అందచేసారని తెలిపారు. రాజేష్ గారికి ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు. అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు.
Saturday, 25 April 2020
యువనేస్తం మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో కందాడ పంచాయతీ ST కాలనీలో ఉన్న చిన్న పిల్లలకు జ్యూస్, బాదంపాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ.
ఈ రోజు 25.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పేడు మండలం కందాడ పంచాయితీ ST కాలనీలో ఉన్న చిన్నపిల్లలకు బిస్కెట్లు ,బాదంపాలు,జ్యుస్ ప్యాకెట్స్ రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, మండల అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి గారు పంపిణీ చేశారని యువనేస్తం ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ కరోనా వైరస్ ను తరిమికొట్టాలంటే ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ ను ప్రజలందరూ తప్పకుండా పాటించాలని కోరారు. ఈ లాక్ డౌన్ వలన నిరుపేదవాళ్ళు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నిరు పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతలు సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో శీను తదితరులు పాల్గొన్నారు.
యువనేస్తం మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతవీరాపురం ST కాలనీ వాసులకు నిత్యావసర వస్తువులు పంపిణీ.
ఈ రోజు 24.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ మరియు సిర్డ్స్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు ఏర్పేడు మండలం పాతవీరాపురం గ్రామం ST కాలనీలో ఉన్న 35 కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. దాతలు ఆర్థికంగాను లేదా నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్నవారు 8466060513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తున్న దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మణి, జయసెంకర్ తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 21 April 2020
Monday, 20 April 2020
దాతల సహాయంతో యువనేస్తం ఆధ్వర్యంలో వలస కూలీలకు 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర వస్తువుల పంపిణీ.
ఈ రోజు 19.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సిద్ధయ్యగుంట గ్రామానికి జయచంద్ర గారు, ధనలక్మి గారు సహయంతో ఏర్పేడు మండలం పంగూర్ గ్రామంలో ఉన్న బీహార్ కూలీలకు 50 కేజీల బియ్యం, 5 కేజీల కందిపప్పు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ అనాధులకు, నిరుపేదవాళ్ళకు సహాయం చేయడానికి ఎల్లప్పుడు యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంటామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు,దాతలు ఆర్థికంగాను, నిత్యావసర వస్తువులు ఎవరైనా సహాయం చేయాలనుకున్న 8466069513 ఈ నెంబర్ కి పోన్ చేయవలచిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో భార్గవ్ గారు తదితరులు పాల్గొన్నారు.
Sunday, 19 April 2020
దాతలు మంజులమ్మ, మునెమ్మ మరియు నాగభూషనమ్మ గారి సహాయంతో యువనేస్తం ఆధ్వర్యంలో 200 భోజన ప్యాకెట్లు పంపిణీ.
ఏర్పేడు లో ఈ రోజు 18.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్ధయ్యగుంట గ్రామానికి చెందిన మంజులమ్మగారు ,మునెమ్మ గారు,నాగభూసనమ్మ గారు వారి సొంత ఖర్చుతో 200 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు ,పోలీసులకు, పంగూర్ లో ఉన్న బీహార్ కూలీలకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన నిరుపేదలకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడు మండలంలో భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. నిరుపేదలకు, అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు,నిరుపేదలకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన మంజులమ్మ గారికి, మునెమ్మ గారికి, నాగభూషనమ్మ గారికి ప్రత్యేకంగా ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు,మరియు ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో, ఈశ్వర్ గారు, భార్గవ్, జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Thursday, 16 April 2020
యువనేస్తం తరపున నాగార్జున స్కూల్ అధినేత భాస్కర్ రెడ్డి గారు పోలీసులు మరియు పారిశుద్ధ్య కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు మరియు అరటిపండ్లు పంపిణీ
ఏర్పేడు లో ఈ రోజు 16.04.2020 యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రేణిగుంటలోని నాగార్జున స్కూల్ అధినేత బాస్కర్ రెడ్డి గారి సహాయంతో పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు మాస్కులు, సానిటీజర్లు, అరటిపండ్లు పంపిణీ చేశామని ఈ సందర్బంగా గౌరవనీయులు సిఐ శివకుమార్ రెడ్డి గారికి అందచేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ పేదలకు,అనాధులకు అవసరం ఉన్నప్పుడల్లా సేవ చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు,లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, 15 April 2020
యువనేస్తం తరపున సిద్ధయ్యగుంట గ్రామస్తులు అనాధలకు, పారిశుద్ధ్య కార్మికులకు 200 భోజనం పాకెట్ల వితరణ.
ఏర్పేడు లో ఈ రోజు 15.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిద్ధయ్యగుంట గ్రామానికి చెందిన అరుణ గారు,జయమునిప్రకాష్ గారు,సుబ్బమ్మ గారు వారి సొంత ఖర్చుతో 200 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు ,పారిశుధ్య కార్మికులకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడులో భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు. కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు. లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. అనాధులకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన అరుణ గారికి,జేయమునిప్రకాశ్ గారికి ,సుబ్బమ్మ గారికి ప్రత్యేకంగా ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు ,మరియు ట్రస్ట్ సభ్యులకు,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గారు, భార్గవ్, విజేయ్ బాబు గారు, భార్గవ్ గారు, ధనంజేయులు గారు తదితరులు పాల్గొన్నారు.
Tuesday, 14 April 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పోలీసులకు, ఆశావర్కర్లకు మరియ పారిశుద్ధ్య కార్మికులకు మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ.
యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు 14.04.2020 మధ్యాహ్నం 3గంటలకు పోలీసులకు,ఆశావర్కర్లకు,పారిశుధ్య కార్మికులకు మజ్జిగ ప్యాకెట్స్,బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు తెలిపారు. ఈ సందర్బంగా మునిశేఖర్ మాట్లాడుతూ అందరికి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రతిరోజు అనాధులకు,నిరుపేదవాళ్ళకు సేవ చెయ్యాలనే లక్ష్యం తోనే ఈ రోజు కూడా మజ్జిగ ప్యాకెట్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దయాకర్, మణి తదితరులు పాల్గొన్నారు.
Monday, 13 April 2020
Sunday, 12 April 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పోలీసులకు, నిరుపేదలకు మరియు లారీ డ్రైవర్లకు 170 భోజనం ప్యాకెట్లు పంపిణీ.
ఈ రోజు 12.04.2020 మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 170 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న పోలీసులకు ,అనాధులకు, నిరుపేదవాళ్లకు ,లారీ డ్రైవర్లకు గౌరవనీయులు C. I. శివకుమార్ రెడ్డి గారి చేతులమీదుగా పంపిణీ చేశామని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు, జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు, దయాకర్ గారు తెలిపారు. ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు, నిరు పేదలకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే భోజనం ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ను పొడిగించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండి కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని కోరారు. లాక్ డౌన్ వలన అనాధులు,నిరుపేదవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్లకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, సిఇ శివకుమార్ రెడ్డి గారికి ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరించినటువంటి S. V. కెటరింగ్ దయాకర్ గారికి మరియు నిరంతరం కృషి చేస్తున్న సభ్యులకు ,దాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Saturday, 11 April 2020
యువనేస్తం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు భోజనం ప్యాకెట్లు పంపిణీ.
ఈ రోజు మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 140 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు ,పారిశుధ్య కార్మికులకు, లారీ డ్రైవర్లకు ,ఆశా వర్కర్లకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశారని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడులో ఉన్న అనాధులకు,లారీ డ్రైవర్లకు, పారిశుధ్య కార్మికులకు ఏర్పేడు S. I. రామచంద్ర నాయక్ గారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు,లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, S. I. రామచంద్ర నాయక్ గారికి ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరించినటువంటి S. V. కెటరింగ్ దయాకర్ గారికి మరియు ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
యువనేస్తం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు, లారీ డ్రైవర్లకు భోజనం ప్యాకెట్లు పంపిణీ.
ఈ రోజు మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాతవీరాపురం గ్రామానికి చెందిన రెడ్డి వారి సుబ్రహ్మణ్యం రెడ్డి(గున్నా రెడ్డి)గారు సహాయంతో 150భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో అనాధులకు ,పారిశుధ్య కార్మికులకు లారీ దైవర్లకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశారని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు.ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడులో ఉన్న అనాధులకు,లారీ దైవర్లకు, పారిశుధ్య కార్మికులకు ఏర్పేడు S.I. రామచంద్ర నాయక్ గారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు,లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, అనాధులకు సహాయం చేయడానికి ముందుకొచ్చిన రెడ్డివారి గున్నారెడ్డి గారికి ప్రత్యేకంగా ట్రస్ట్ తరుపున ధన్యవాదాలు తెలిపారు, మరియు S.I. రామచంద్ర నాయక్ గారికి ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరించినటువంటి S.V కెటరింగ్ దయాకర్ గారికి మరియు ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
Tuesday, 7 April 2020
Monday, 6 April 2020
Thursday, 2 April 2020
Subscribe to:
Posts (Atom)