ఈ రోజు మధ్యాహ్నం యువనేస్తం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 140 భోజనం ప్యాకెట్లను ఏర్పేడులో ఉన్న అనాధులకు ,పారిశుధ్య కార్మికులకు, లారీ డ్రైవర్లకు ,ఆశా వర్కర్లకు భోజనం ప్యాకేట్లను పంపిణీ చేశారని ట్రస్ట్ వ్యవస్థాపకులు&చైర్మన్ మునిశేఖర్ గారు ,రాష్ట్ర అధ్యక్షులు వినోద్ గారు,జిల్లా అధ్యక్షులు జస్వంత్ గారు ,దయాకర్ గారు తెలిపారు,ఈ సందర్భంగా మునిశేఖర్ గారు మాట్లాడుతూ ప్రతీ రోజు ఒకపూట అయిన అనాధులకు భోజనం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే రోజు లాగానే ఈ రోజు కూడా ఏర్పేడులో ఉన్న అనాధులకు,లారీ డ్రైవర్లకు, పారిశుధ్య కార్మికులకు ఏర్పేడు S. I. రామచంద్ర నాయక్ గారి చేతుల మీదుగా భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశామని తెలిపారు, కరోనా వైరస్ చాలా ప్రమాదకరమైనదని అందుకనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయని ప్రజలందరూ తప్పకుండా పాటించి ఇంటిలోనే ఉండాలని కోరారు,లాక్ డౌన్ వలన అనాధులు ఆకలితో చాలా ఇబ్బంది పడుతున్నారని అనాధులకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, S. I. రామచంద్ర నాయక్ గారికి ఈ అన్నదాన కార్యక్రమాలకు సహకరించినటువంటి S. V. కెటరింగ్ దయాకర్ గారికి మరియు ట్రస్ట్ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
No comments:
Post a Comment